సాగర్ పోరు: తొలిరోజు 5 నామినేషన్లు దాఖలు
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు తొలిరోజు (మంగళవారం) 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదుగురు స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. టీఆర్ఎస్, బీజేపీ లు తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు ఉదయం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.31న నామినేషన్ల పరిశీలన. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17న ఎన్నికల పోలింగ్. మే 2న ఫలితం వెల్లడికానుంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.