సిర్పూర్(టీ)లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

సిర్పూర్(టీ): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండలం లోని జైభీమ్ నగర్ కాలనీ అంబేద్కర్ భవన్ లో బుధ‌వారం అంబేద్కర్ 130వ జయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో అంబేద్కర్, బుద్దుడి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ నడిచినటువంటి బాటను ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని అందరూ కాపాడాలని కోరారు. అంబేద్కర్ రాసినటువంటి గ్రంథాలను ప్రతి ఒక్కరూ చదవాలని. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ఉన్న‌తికోసం అంబేడ్క‌ర్ కృషి చేశార‌ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో నాగరాడే రాజు, దుర్గం విక్రమ్, దుర్గం జయంత్, కుషాల్, దేవిదాస్, మానేపల్లి ప్రభాకర్,దుర్గం తిరుపతి, మహిళా సొసైటీ అధ్యక్షురాలు మాల్కార్ లలిత, జనరల్ సెక్రెటరీ, డోంగ్రే హేమలత, చూనర్ కార్ కమల, దుర్గం, లక్ష్మి, రూప, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.