హైదరాబాద్ లో మాస్క్ పెట్టుకోకుంటే..

హైద‌రాబాద్: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఒక్క రోజులో 68 వేల పై బ‌డి కేసులు న‌మోద‌వుతుంటే.. ఒక్క మ‌హారాష్ట్రలోనే 40 వేల‌కు పైబ‌డి కేసులు న‌మోద‌వుతున్నాయి. అలాగే క‌ర్ణాట‌క‌, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, చ‌త్తీస్‌ఘ‌డ్‌ల‌లో కూడా భారీ సంఖ్య‌లో రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈనేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అలాగే తెలంగా రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌భుత్వం సిద్దం అయింది. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జ‌లు క‌రోనా నిబంద‌న‌లు గాలికొదిలేసి తిరుగుతుండ‌టంతో, చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించింది ప్ర‌భుత్వం. ఈరోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించ‌బోతున్నారు. మాస్క్ లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట క‌నిపిస్తే వారికి భారీ జ‌రిమానా విధించాల‌ని నిర్ణ‌యించారు. క‌రోనాను వ్యాప్తి చెంద‌కుండా నియంత్రించాలి అంటే, త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ పెట్టుకోవాలి. లేదంటే, మ‌హామ్మారికి చెక్ చెప్ప‌డం క‌ష్టం అవుతుంది. రాష్ట్రంలో రోజువారి క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌టంతో మాస్క్ ను త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం.

Leave A Reply

Your email address will not be published.