హైద‌రాబాద్‌లో అత్త చేతిలో అల్లుడు హ‌త్య‌

హైద‌రాబాద్ : త‌న బిడ్డ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌తీకారంగా అల్లుడిని హ‌త్య చేసిన‌ అత్త.. ఈ ఘ‌ట‌న న‌గ‌రంలోని రామంతాపూర్‌లో దారుణం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. రామంతాపూర్‌కు చెందిన న‌వీన్‌కు మీర్‌పేట‌కు చెందిన ఓ యువ‌తితో వివాహ‌మైంది. అయితే పెళ్లి అయిన నెల రోజుల‌కే న‌వీన్ భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీంతో మృతురాలి త‌ల్లి అనిత మీర్‌పేట పోలీసు స్టేష‌న్‌లో న‌వీన్‌పై ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు న‌వీన్‌ను జైలుకు త‌ర‌లించారు. ఇటీవ‌లే న‌వీన్ జైలు నుంచి విడుద‌ల అయ్యాడు. ఈ విడుద‌ల విష‌యం తెలుసుకున్న అత్త అనిత‌ రామంతాపూర్‌లోని న‌వీన్ ఇంటికి గురువారం ఉద‌యం చేరుకుంది. అల్లుడిపై క‌త్తితో దాడి చేసి చంపింది అనిత‌. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న ఉప్ప‌ల్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విచార‌ణ అనంత‌రం పూర్తి వివ‌రాలు మీడియాకు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.