భారత్‌లో 90.99% రికవరీ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యప్తి కొనసాగుతోంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. మొన్నటి వరకు నిత్యం 50వేల నుంచి 60వేలకుపైగా పాజిటివ్ నమోదు అవుతుండగా.. తొలిసారిగా గడిచిన 24గంటల్లో 49,881 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80లక్షల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 80,40,203కు చేరాయి. తాజాగా 517 మంది మహమ్మారి కారణంగా మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,20,527కి చేరింది.
తప్పక చదవండి: తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు
గత 24గంటల్లో 56,480 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 73,15,989 మంది కోలుకోగా 6,03,678 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. బుధవారం ఒకే రోజు 10,75,760 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 10,65,63,440 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
దాదాపు 90.99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 7.51శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.50 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది.