ఆచార్య: లాహే లాహే లిరికల్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్న ప్రాజెక్టు ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి లాహే లాహే పాటను మేకర్స్ విడుదల చేశారు. చిరు మునుపటిలా చాలా ఎనర్జిటిక్ గా స్టైలిష్ డ్యాన్స్ తో అదరగొడతాడని రషెస్ చూస్తే తెలిసిపోతుంది. లాహే లాహే పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులకు థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేయడం ఖాయమనిపిస్తోంది. ఓ భారీ బృందంతో నటి సంగీత మొదలెట్టే ఆ పాటకు చిరు మధ్యలో జాయిన్ అయ్యి వేసిన స్టెప్టులు చూస్తుంటే ఆయన వయసు 65 కాదు 25 అన్నట్టుగా ఉంది.

దానికి తోడు కాజల్ వచ్చి కలిసే సరికీ పాట మరో రేంజ్ కు వెళ్ళిపోయింది.సీనియర్ నటి సంగీత, కాజల్ పాటలో కాజల్, సంగీత సంప్రదాయ వస్త్రధారణలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. దేవాదాయ శాఖ నేపథ్యంలో ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై రాంచరణ్ , నిరంజన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఓవర్ ఆల్ గా ఇదో విజువల్ ఫీస్ట్! దీనికి తోడు మేకింగ్ షాట్స్ లో చెర్రీ ఎంట్రీ మెగాఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకునేలా చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్న మెగాస్టార్ ‘ఆచార్య’గా నట విశ్వరూపం చూపడం ఖాయమనిపిస్తోంది.
