మంచిర్యాల‌: ఘ‌నంగా అంబేడ్క‌ర్ జ‌యంతి

మంచిర్యాల: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడ‌క‌లు మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. జిల్లాలోని ప‌లు చోట్ల అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఎంపి, ఎమ్మెల్యేలు, జెడ్‌పి చైర్మ‌న్, ప‌లు సంఘాల నాయ‌కులు, ఇత‌ర నాయ‌కులు త‌దిత‌రులు అంబేడ్క‌ర్ జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

ప్ర‌భుత్వాసుప‌త్రిలో పండ్లు పంపిణీ చేస్తున్న ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దివ‌క‌ర్‌రావు త‌దిత‌రులు

ఐబి చౌర‌స్తాలో ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దివ‌క‌ర్‌రావు

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని స్థానిక ఐ.బి చౌరస్తాలోని అంబేద్కర్ గారి విగ్రహానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారికి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంచిర్యాల ప‌ట్ట‌ణంలోని ప‌లువురు టిఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.


ZP చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి-ఓదెలు, వైస్ చైర్మన్ శ్రీ తొంగల సత్యనారాయణ ZP సీఈఓ నరేందర్ త‌దిత‌రులు

మంచిర్యాల జిల్లా ZP కార్యాల‌యంలో..

అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బుధ‌వారం ZP చైర్మన్ శ్రీమతి శ్రీ నల్లాల భాగ్యలక్ష్మి-ఓదెలు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైస్ చైర్మన్ శ్రీ తొంగల సత్యనారాయణ ZP సీఈఓ నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు

బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, త‌దిత‌ర నాయ‌కులు

బెల్లంప‌ల్లిలో..
బెల్లంపల్లి: పట్టణం లో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, త‌దిత‌ర నాయ‌కులు


TNMVS నాయ‌కులు

TNMVS రాష్ట్ర నాయకుల పిలుపు మేరకి ఈరోజు అనగా ఏప్రిల్ 14, ఉదయం 10గంటలకు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, 130 వ జయంతి వేడుకలు, జరుపుకోవడం, జరిగింది పేద బడుగు, బలహీన వర్గాల ఆశ జ్యోతి, అంబేద్కర్ గారి జీవితచరిత్ర అందరు తెలుసుకోవలసిన అవసరం ఉంది, కావున, విద్యార్థి మిత్ర లోకo, ఉన్నత చదువులు చదువుతూ, అదేవిదంగా tnmvs, సంఘన్ని కూడు మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూన్న, ఈకార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, పైడిపెల్లి చంద్రశేఖర్,చెన్నూర్ మండల అధ్యక్షులు గోదారి రాజేష్, కోటపల్లి మండలఅధ్యక్షులు కామెర పవన్ కుమార్, భీమారం మండల అధ్యక్షులు దుర్గం లక్ష్మన్, దుర్గం రవితేజ తదితరులు పాల్గొన్నారు.


పెద్దగూడెం చిన్న గూడెం గ్రామ పంచాయతీలో

పెద్దవూర మండలం పెద్దగూడెం చిన్న గూడెం గ్రామ పంచాయతీ నందు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు చెన్నూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నమాజ్ ఉద్దీన్ , రామ్ లాల్ gilda, పోగుల సతీష్, నాయిని సతీష్ రాజ్ పెండ్యాల లక్ష్మణ్, వెంకట రాజం, మల్లికార్జున యాదవ్, తడకల రంజిత్, అఖిల్ , మరియు జాడి సంపత్ పాల్గొన్నారు.

 

ఐ.బి చౌరస్తాలో పట్టణ నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు విష్ణు భక్తుల సదానందం త‌దిత‌రులు

ఐ.బి చౌరస్తాలో

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని స్థానిక ఐ.బి చౌరస్తాలోని అంబేద్కర్ గారి విగ్రహానికి మంచిర్యాల పట్టణ నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు విష్ణు భక్తుల సదానందం పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయ‌న‌తో పాటు నాయి మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి చిలువేరు పొన్నం మరియు కమిటీ సభ్యులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


మంద‌మ‌ర్రిలో..

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130 వ జయంతి సందర్భంగా బుధ‌వారం మందమర్రి పట్టణం మార్కెట్ ఏరియాలోని విగ్ర‌హానికి పూలమాల వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కేక్ కట్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని ప్రాథమిక విద్య నుండి భారత రాజ్యాంగాన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని వారి కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అంబేద్కర్ త్యాగాలను కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో తౌటం శ్రీనివాస్ మైసయ్యా తెరాస యువ నాయకులు MD జావిద్ ఖాన్ నేరువట్ల సుజిత్, భాను, మిమిక్రీ ఆర్టిస్ట్ అన్వేష్ సూర్య.మరియు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సుధాల ప్రభుదేవు జావిద్ పాషా రాజు వినోద్ నాగరాజు రఫీ తదితరులు పాల్గొన్నారు.


కోటపల్లి మండలం మల్లంపేట్ లో

కోట‌ప‌ల్లి మండ‌లం మ‌ల్లంపేట్‌లో..

అంబేద్కర్ జయంతి ఉత్సవాలను బుధ‌వారం అంబెడ్కర్ యువజన సంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటపల్లి మండల ఎంపీపీ మంత్రి సురేఖ-రామయ్య, ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ లక్ష్మయ్య, ఎంపీటీసీ చంద్రగిరి శంకరయ్య గారు,అంబెడ్కర్ సంగం సభ్యులు కుమ్మరి రాజేందర్, సుణాతికారి మాధురి, kamera గోపాల్, ఆకుదారి అర్జున్, గౌరవ సభ్యులు సల్పాల పోచం, బోర్కొటి బిక్కయ్య, గ్రామ ప్రజలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేయడం జరిగింది.

ఈ సంద‌ర్భంగా ఎంపీటీసీ శంకరయ్య గారు మాట్లాడుతు యువత, ప్రతీ పౌరుడు చదువుకుని అంబెడ్కర్ అడుగుజాడల్లో నడవాలని అప్పుడే మార్పు సాధ్యం అని అన్నారు. సూపరింటెండెంట్ లక్ష్మయ్య గారు మాట్లాడుతు అంబెడ్కర్ చెప్పినట్టు సమాజంలో అందరికి రాజకీయ, ఆర్థిక, సమానత్వం రావాలంటే రాజ్యాంగం, చదువు గొప్పతనాన్ని అయన అపార జ్ఞానశక్తిని మనం నరనరాన ఇముడిచ్చుకోవాలని కోరారు. ఎంపీపీ గారు మాట్లాడుతు నాడు అంబెడ్కర్ ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని మనకు కల్పించిన సమానత్వ హక్కులను మనం చదువు ద్వారానే సాధించగలమని అన్నారు. కార్యక్రమం అనంతరం అంబెడ్కర్ యువజన సంగం ఆధ్వర్యంలో ముఖ్య అథితుల చేతుల మీదుగా గ్రామంలో మాస్క్ లను పంపిణి చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.