ఎపిలో కొత్తగా 58 కరోనా కేసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 20,269 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా 58 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఎపి వైద్య ఆరోగ్యశాఖ సోమవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. అలాగే వైరస్ బారినపడిన వారిలో తాజాగా 51 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో కలిపి ఎపిలో ఇప్పటివరకు 8,89,974 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,82,080 చికిత్సకు కోలుకున్నారు. 725 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి రకు రాష్ట్రంలో కరోనాతో 7169 మంది మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు.