ఐదో రౌండు: `పల్లా`కి 18,549 ఓట్ల ఆధిక్యత

న‌ల్ల‌గొండ‌: తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు మూడు రౌండ్ల పూర్త‌వ్వ‌గా టిఆర్ ఎస్ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవి ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. అలాగే నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 18,549 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో పల్లాకు పోలైన మొత్తం ఓట్లు 79,113. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. అతనికి 60,564 ఓట్లు వచ్చాయి. ఇక, మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. ఆయనకు 49,200 ఓట్లు పోలయ్యాయి. మొత్తం చెల్లని ఓట్లు 15, 533. ఇక్క‌డ 71 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.

మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తి.. వాణీదేవి ముందంజ‌
హైద‌రాబాద్‌: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తి కావడంతో అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఆ వెంటనే నాల్గో రౌండ్ కౌంటింగ్ చేపట్టారు. ఇప్పటి వరకు 1,68,032 ఓట్లను లెక్కించినట్టు వెల్లడించారు అధికారులు.. ఇందులో చెల్లని ఓట్లు పక్కనబెడితే.. లక్షా 57 వేల 950 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి.

మూడో రౌండ్ ముగిసే స‌రికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్‌లో వాణీదేవికి 17,836 ఓట్లు ల‌భించాయి. ఓట్ల‌లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 53,007 ఓట్లు (33.5%) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 48,563 ఓట్లు (30.7%) వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌ 25,505 (16.1%) ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి చిన్నారెడ్డికి 15,035 ఓట్లు (9.5%), హర్ష వర్ధన్ రెడ్డి 4,872 ఓట్లు, టీడీపీ అభ్యర్‌థి ఎల్ రమణకు 2,673 ఓట్లు వచ్చాయి. ఇంకా కౌంట్ చేయాల్సిన ఓట్లు లక్షా 89 వేల 322గా ఉన్నాయి. ప్ర‌స్తుతం నాలుగో రౌండ్ ఓట్ల కౌంటింగ్ కొన‌సాగుతోంది.

1 Comment
  1. […] ఐదో రౌండు: `పల్లా`కి 18,549 ఓట్ల ఆధిక్యత […]

Leave A Reply

Your email address will not be published.