కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కన్నుమూత

ముంబ‌యి: దేశంలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. మ‌హారాష్ట్రలో క‌రోనా క‌ట్ట‌డికి స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకున్న‌ప్పటికీ క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్రలో కరోనా వైరస్‌ బారిన పడి మరో ఎమ్మెల్యే మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రావ్‌ సాహెబ్‌ అనంత్‌పుర్కర్‌ (64) కన్నుమూశారు. నాందెడ్‌ జిల్లాలోని దెగ్లూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతికి మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ సంతాపం ప్రకటించారు. అతడి కుటుంబసభ్యులకు ధైర్యం ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.