కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోవిడ్‌-19 టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో ద‌శ వ్యాక్సినేష‌న్లో భాగంగా 60 ఏళ్లు పైబ‌డిన వారికి, 45 నుంచి 59 సంవ‌త్స‌రాల‌లోపు ఉన్న దీర్ఘ‌కాల వ్యాధిగ్ర‌స్తుల‌కు ఈ రోజు నుంచి టీకా ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. దేశీయంగా తయారైన భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను ప్రధాని వేయించుకున్నారు. ఎయిమ్స్‌ సిస్టర్‌ పీ. నివేదా ప్రధానికి సిరంజీ ద్వారా టీకా ఇచ్చారు.

తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.
‘ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు వేగంగా చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. అర్హులైన ప్రతి ఒక్కరు కొవిడ్‌ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.’ అని మోడీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.