ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపు మనదే

మంత్రులు, పార్టీ నేతలతో ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టిఆర్  ఎస్ అభ్య‌ర్థులు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, సుర‌భి వాణీదేవి మొద‌టి ప్రాధాన్య ఓట్ల‌తో ఘ‌న విజ‌యం సాధిస్తార‌ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రెండు పట్టభద్రుల స్థానాల్లో గెలుపుకోసం వ్యూహాత్మకంగా విజయమే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్‌ఎస్‌ నేతలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్‌ను మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, భరత్‌, తాతా మధు, వై వెంకటేశ్వర్‌రావు తదితరులు ఆదివారం కలిశారు. పట్టభద్రుల ఎన్నికలపై సీఎం ఆరాతీశారు. ప్రచార సరళిపై నేతలకు సూచనలు చేసినట్టు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.