ఎంపి మాలోత్ క‌విత త్వ‌ర‌గా కోలుకోవాల‌ని..

నెల్లికుదురు: మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంటు స‌భ్యురాలు మాలోత్ క‌విత క‌రోనా నుండి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నెల్లికుదురు మండ‌లంలోని తార‌సింగ్ బావి తండాలో అభిమానులు ప్ర‌త్యేక పూజాలు నిర్వ‌హించారు. శ‌నివారం గ్రామంలోని హ‌నుమాన్ గుడిలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో ఎంపి మాలోత్ క‌విత అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, గ్రామ‌స్తులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. “మా ఎంపి తొంద‌ర‌గా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో మానుకోట ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని హ‌నుమాన్ స్వామివారిని వేడుకున్నాం“ అని  తెలిపారు. కొయ్యాడి వెంక‌న్న గౌడ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మంలో ఎంపి క‌విత‌ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, ఆల‌య పూజారి యోగానంద స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. గత రెండు రోజులుగా జలుబుతో బాధపడుతు యంపి కవిత నిన్న (శుక్ర‌వారం) కరోన పరిక్ష చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కావునా గ‌త కొన్ని రోజులుగా ఎంపిని క‌ల‌వ‌డానికి వ‌చ్చివారు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ ప‌రీక్ష జ‌రుపుకోవాల‌ని ఎంపి కార్యాల‌య సిబ్బంది వెల్ల‌డించారు.

ఎవరు ఎటువంటి ఆందోళనలు చెందవద్దని తాను అరోగ్యాంగనే ఉన్నట్లు ఎంపి తెలిపారు. తాను తన కుటుంబ సభ్యులతో స్వీయ నిర్బంధలో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.