తెలంగాణలో కొత్తగా 403 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 403 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,742 కి చేరింది. వీటిలో 3,00,469 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,583 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 1,690 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు.