తెలంగాణలో కొత్త‌గా 412 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేశారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,867 కి చేరింది. వీటిలో 2,99,042 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,151 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కరోనాతో రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,674 మంది మృతి చెందారు. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను హెచ్చరించింది. తాజాగా జిహెచ్ ఎంసి ప‌రిధిలో కొత్త‌గా 103 కేసులు న‌మోద‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.