మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వాలియర్ ఓల్డ్ దావ్ని సమీపంలో వెళ్తున్న బస్సును ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మహిళలతో పాటు ఒక వ్యక్తి మరణించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ‘అంగన్‌వాడీ కేంద్రా’లో కుక్‌లుగా ఉన్న మహిళలు పని తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘి తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.