బెంగాల్: బిజెపి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పనిమనిషి

న్యూ ఢిల్లీ: మార్చి 27 వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అస్‌‌గ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓ ప‌ని మ‌నిషిని త‌మ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపింది బిజెపి. ఆమెను ఎంపిక చేయ‌డం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బిజెపి ఇచ్చిన షాక్ కు ఇతర పార్టీల నేతలే కాదు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆ పనిమనిషి ఎవరు అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కలిత అనే పనిమనిషిని బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కలిత నెల రోజులపాటు తన పనికి సెలవు పెట్టి ప్రచారం చేసుకుంటోంది. రోజువారీ పనులు చేసే తన భర్తతో కలిసి కలిత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. త‌న భ‌ర్త సుబ్ర‌తామ‌జ్హీ.. ఓ ఫ్లంబ‌ర్‌. కాగా క‌విత ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపైనే విమ‌ర్శ‌ల బాణం ఎక్కుపెట్టారు. ఇక పేదరికంలో మగ్గుతున్న తనకు ఆ పేదరికం ఎలా ఉంటుందో తెలుసు అని, గెలిస్తే అస్ గ్రామ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కలిత అంటోంది.

Leave A Reply

Your email address will not be published.