భార‌త్‌లో కొత్త‌గా 13,742 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 13,742 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు బుధ‌వారం కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి భార‌త్‌లో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 1,10,30,176 కు చేరింది. వీటిలో 1,07,26,702 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 1,46,907 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 104 మంది మృతి చెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో క‌రోనాతో మృతిచెందిన‌వారి సంఖ్య 1,56,567 కు చేరిందని కేంద్ర ఆరోగ్య‌శాఖ అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.