CBSE పదో తరగతి పరీక్షలు రద్దు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటించింది. దీంతోపాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించింది.

ఈ పరీక్షలపై జూన్‌లో మరోసారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బోర్డు పరీక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం స్వయంగా అధికారులతో సమీక్షించారు.

“ దేశంలో మ‌హ‌మ్మారి ఉధృతి.. స్కూళ్ల మూసివేత నేప‌థ్యంలో విద్యార్థుల భద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకునొ మే 4 నుంచి జ‌ర‌గాల్సిన సిబిఎస్ ఇ 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్నాం. బోర్డు త‌యారు చేసే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తాం. ఇక 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్నాం. జూన్ 1 త‌ర్వ‌త స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకంటాం. ప‌రీక్ష‌లు ప్రారంభానికి 15 రోజుల ముందుగానే వివ‌రాలు ప్ర‌కటిస్తాం“ అని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.