మరోసారి భారీగా పెరిగిన ధరలు

హైద‌రాబాద్‌: గ‌త కొంత కాలంగా బంగారం ధ‌ర‌ల్ల‌లో ఒడిదుడుకులు కొన‌సాగుతూనే ఉన్నాయి. గత కొంత కాలంగా పెరుగుతూ.. త‌గ్గుతూ వ‌స్తున్న ప‌సిడి ధ‌ర‌లు తాజా మ‌ళ్లీ పెరిగాయి. ఇక మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 పెరిగి రూ. 47,460 కు చేరింది.

అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 43,500 కు చేరింది.

వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 72,100 కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.