యాస్ తుపానుపై విద్యుత్ శాఖ కాల్ సెంటర్ ప్రారంభం

రామచంద్రపురం (CLiC2NEWS): వచ్చే యాస్ తుఫాను ప్రభావం వల్ల విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా తక్షణం రామచంద్రపురం డివిజన్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు 9490610098  ఫోన్ చేసి చెప్పొచ్చని రామచంద్రపురం ఎలక్ట్రికల్ డిఈ దాట్ల శ్రీధర్ వర్మ వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ  ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో రామచంద్రపురం  ఎలక్ట్రికల్ డివిజన్ పరిధిలో  ఉన్న ఎనిమిది మండలాలు,  రెండు మున్సిపాలిటీలకు సంబంధించి కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. యాస్  తుఫాను తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా విపత్కర సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అందించాలనే సంకల్పంతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. తుఫాను ప్రభావం చూపించి  డివిజన్ పరిధిలో స్తంభాలు విరిగిపడడం, వైర్లు తెగిపోవడం వంటివి సంభవిస్తే తక్షణం కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసి చెప్పాలని అన్నారు. అలాగే  తుఫాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఎక్కడినా వైర్లు తెగిపడినా, వర్షం వచ్చే సమయంలో విద్యుత్ స్తంభాలను తాకరాదని డిఈ కోరారు. తుఫాను తీరం దాటే వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుందన్నారు. డివిజన్ పరిధిలో తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఏ విధమైన అంతరాయం ఏర్పడిన తక్షణం కాల్ సెంటర్ కి సమాచారం అందించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.