Mandapeta: పంచాయతీ సిబ్బందికి వ్యాక్సినేషన్ కూపన్లు పంపిణీ..
మండపేట (CLiC2NEWS): పంచాయితీ, సచివాలయ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయడానికి కూపన్లు పంపిణీ చేస్తున్నామని ఎంపీడీవో అయిదం రాజు తెలిపారు. సోమవారం విడుదలచేసిన ఒక ప్రకటన ద్వారా ఎంపీడీవో రాజు మాట్లాడుతూ పంచాయితీ కార్యదర్శులు అందులో పని చేసే సిబ్బంది, సచివాలయాల సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో 45 ఏళ్లు దాటిన వారందరికీ కొవీషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నట్టు చెప్పారు. అలాగే పంచాయతీ సర్పంచులు వార్డు మెంబర్లకు ఆయా కుటుంబాల్లో 45 ఏళ్లు పైబడిన వారికి మొదటి డోస్ టీకా వేస్తున్నామని అన్నారు. రేపు అనగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో కూపన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏడిద, ఏడిద సీతానగరం, మారేడుబాక పరిధిలో ఉన్న సిబ్బందికి ఇప్పనపాడు ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ అందుతుంది అన్నారు. మిగిలిన వారు ద్వారపూడి ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టీకా వేయించు కోవాలని కోరారు. మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే వారు విధిగా తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు చెప్పి పేర్లు నమోదు చేసుకొని కూపన్లు తీసుకుని వెళ్ళాలని అన్నారు.