రియలిస్టిక్‌గా `విరాటపర్వం` టీజర్

చిరంజీవి చేతుల మీదుగా 'విరాటపర్వం' టీజర్ విడుదల

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ సినిమా టీజర్ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. వాస్తవ కథకు దగ్గరగా, ఎంతో రియలిస్టిక్గా టీజర్ ఉందంటూ చిత్ర బృందంపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

యదార్ధ సంఘటనల ఆధారంగా 1990ల్లో నాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియమణి భారతక్కగా పవర్ ఫుల్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. రానా, సాయిపల్లవి నటన ఆద్యంతం భావోద్వేగ భరితంగా సాగింది. ‘ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్ని నాళ్లు?తారతమ్య గోడలనే పికిలించగ ఎన్నినాళ్లు?దున్నేటోడి వెన్ను విడిచి భూస్వాములు ధనికులైరి’ అనే రానా కవిత్వంతో టీజర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో రానా.. డాక్టర్ రవి శంకర్ నుంచి రవన్న అలియాస్ అరణ్యగా ఎందుకు మారాడనేదే స్టోరీ.

అలాగే నవదీప్, నవీన్ చంద్ర, నందితా దాస్, జరీనా వహాబ్ , ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తునన్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave A Reply

Your email address will not be published.