వాలినతో విడదీయరాని బంధం..
సూర్య భాస్కరరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజ్యసభ సభ్యులు బోస్ ..
మండపేట (CLiC2NEWS): కాంగ్రెస్ మాజీ నేత వాలిన సూర్య భాస్కరరావుకు తనకు ఉన్న బంధం విడదీయరానిది అని రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన వాలిన సూర్య భాస్కరరావు కుటుంబ సభ్యులను బుధవారం ఆయన తనయుడు సూర్యప్రకాష్ తో కలిసి బోస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వాలిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బోస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వాలిన సూర్య భాస్కరరావుకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది అన్నారు.

రాజీవ్ కుటుంబ సభ్యులతో వాలిన సన్నిహితంగా ఉండేవారని అన్నారు. ఒకానొక సమయంలో వాలిన రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ లో తామిద్దరం కలిసి పనిచేసిన సమయంలో వాలిన రాజకీయ సలహాలు మంచి గుర్తింపు వచ్చేవిగా ఉండేవని అన్నారు. వాలిన లేకపోవడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పెద్ద దిక్కును కోలోయినట్టు అయింది అన్నారు. కుటుబ సభ్యులకు ఏ కష్టం వచ్చిన తాను అండగా ఉంటానని వాలిన కుమారుడు వీరబాబును ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, షేక్ అండ్ షేక్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా, చిలుకూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.