TS: ఇంటర్ పరీక్షలు రద్దు!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ రెండో సంవత్సరం సంవత్సరం పరీక్షలు రద్దయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్టికే మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర సర్కార్… తాగాజా ఇంటర్ రెండో ఏడాది పరీక్షలను కూడా రద్దు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలపై నిన్న (మంగళవారం) మంత్రివర్గ సమావవేశంలో చర్చ జరిగింది.
సిబిఎస్ఇ, ఐసిఎస్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని అధికారులు మంత్రి వర్గం దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సబబు కాదని కేబినెట్ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నిర్ణయంపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
ఇప్పటికే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేసిన విషయం విదితమే.