విశాఖ మేయర్‌గా గోలగాని హరి వెంకట కుమారి

ఎపిలో కొన‌సాగుతున్న మేయ‌ర్‌, చైర్మ‌న్ల ఎన్నిక‌

అమ‌రావ‌తి: ఏపీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. 11 న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు, 75 పుర‌పాల‌క‌, న‌గ‌ర పంచాయ‌తీల్లో కొత్త‌గా ఎన్నికైన కార్పొరేట‌ర్లు, వార్డు స‌బ్యుల ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఇవాళ (గురువారం) సంద‌డిగా సాగింది.

మున్సిపల్‌ ఛైర్మన్‌, మేయర్‌ అభ్యర్థుల జాబితా ఒక్కొక్కటిగా విడుదలవుతోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపల్‌ చైర్మన్‌గా దాసి సుధాకర్‌ రెడ్డిని ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం.

మ‌హా విశాఖన‌గ‌ర‌పాల‌క సంస్థ‌ మేయర్‌గా 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయ‌ర్‌గా జియ్యాని శ్రీ‌ధ‌ర్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. 58 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిసి సెంట్రల్‌ పార్క్‌కు వచ్చిన విజయసాయిరెడ్డి… అక్కడ YSR విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అందరితో కలిసి GVMCకి పాదయాత్రగా బయలుదేరారు.

గుంటూరు మేయ‌ర్‌గా కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు, డిప్యూటీ మేయ‌ర్‌గా డైమండ్ బాబు ఎన్నిక‌య్యారు.

అనంతపురం జిల్లాలోని గుంతకల్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా ఎన్‌. భవాని, గుత్తి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా ఎమ్‌డీ. వన్నూర్‌బీని కన్‌ఫర్మ్‌ చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా బట్టిన నాగలక్ష్మి, కొవ్వూరు చైర్ పర్సన్‌గా రత్నకుమారి, నర్సాపురం చైర్మన్‌గా బర్రి వెంకట్రమణ, నిడదవోలు చైర్మన్‌గా భూపతి ఆదినారాయణకు అవకాశమిచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి చైర్‌ పర్సన్‌గా ఇస్తారమ్మ, కనిగిరి చైర్మన్‌గా గఫూర్‌ను ఎంపిక చేసింది వైసీపీ. తూర్పు గోదావరి జిల్లా తునికి సుధారాణి, ఏలేశ్వరం మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ అలమంద సత్యవతిని కన్‌ఫర్మ్‌ చేసింది వైసీపీ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌గా పిలక రాజ్యలక్ష్మి, కాశీబుగ్గ చైర్మన్‌గా గిరిబాబుకు అవకాశమిచ్చింది పార్టీ అధిష్టానం.

Leave A Reply

Your email address will not be published.