మూడో రౌండ్ పూర్తి: ముందంజలో పల్లా
హైదరాబాద్/నల్లగొండ: ఎమ్మెల్సీ పోరులో కారు జోరు కొనసాగుతోంది. నల్గొండ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొదటి, రెండో రౌండ్‌లో సత్తా చాటిన పల్లా.. మూడోనూ అదే రిపీట్ చేస్తున్నారు.
మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. మూడో రౌండ్ పూర్తయ్యే సమయానికి 17,393 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తొలి స్థానంలో ఉన్నారు. 13,122 ఓట్లతో తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఇక 11,907 ఓట్లతో ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. మొత్తం మూడు రౌండ్లు కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డి 12,142 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఇక మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవగా.. రెండో రౌండ్ లెక్కింపు జరుగుతోంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ముందంజలో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్ రావు ఉన్నారు.
[…] మూడో రౌండ్ పూర్తి: ముందంజలో పల్లా […]