శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్: పసిడి ప్రియులకు శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో బులియన్ మార్కెట్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. దాంతో హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,880 కు చేరింది, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి రూ. 42,050 కు చేరింది.
ఇక ఈరోజు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ. 1,800 తగ్గి రూ. 70,000 కు చేరుకుంది. బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఈ హెచ్చుతగ్గులతో బంగారం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.