సాగర్ టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌

హైదరాబాద్‌:  న‌ల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగ‌త ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ కుమార్ ను ఆ పార్టీ ఎంపిక చేసింది. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌.. భగత్‌కు బీఫామ్‌ అందజేశారు.

పార్టీ ప్రచారం కోసం 28లక్షల చెక్‌ను కూడా అందించారు. రేపు ఉదయం భగత్‌‌ తన నామినేషన్‌ వేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని నిలబెట్టింది. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. సాగర్‌ ఉప ఎన్నికలో టికెట్‌ ఆశించిన టీఆర్‌ఎస్‌ నేత కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.పార్టీ శ్రేణుల అభిప్రాయాల‌కు తోడు నోముల న‌ర్సింహ‌య్య పార్టీ కి అందించిన సేవ‌ల‌కు గుర్తింపుగా ఆయ‌న వార‌సునికి అవ‌కాశం ఇవ్వ‌డం మేల‌ని భావించిన టిఆర్ ఎస్ అధినేత భ‌గ‌త్‌కు టికెట్‌ను ఖ‌రారు చేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.