తెలంగాణలో కొత్త‌గా 278 కరోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 278 కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు గురువారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య్య 3,02,047కి చేరింది. వీటిలో 2,98,120 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధ‌లో తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1662కి చేరింది. ప్ర‌స్తుత‌లం రాష్ట్రంలో 2,265 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.

toto slot

Leave A Reply

Your email address will not be published.