10 రోజుల్లో రెట్టింపు కేసులు.. వెయ్యి దాటిన మరణాలు
న్యూఢిల్లీ: ఇండియాలో ఉగ్రరూపం ధరించి కల్లోలం సృష్టిస్తోంది. భారీగా ప్రాణాలను హరిస్తోంది. బుధవారం 2 లక్షలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,00,739 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది. ఇందులో 1,24,29,564 మంది దేశంలో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1038 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,73,123కి చేరింది 24 గంటల్లో ఇండియాలో 93,528 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం 14,71,877 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.