తెలంగాణలో కొత్తగా 3307 కేసులు నమోదు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 3307 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం కరోరా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,08,396 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో కొత్తగా రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1788కి చేరిందని అధికారులు పేర్కొన్నారు. నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 446 నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజ్‌గిరిలో 314, రంగారెడ్డిలో 277 కేసులు నమోదయ్యాయి.
