అసోంలో ఏనుగుల మందను ఢీకొన్ని రాజధాని ఎక్స్ ప్రెస్
గుహవాటి (CLiC2NEWS): అసోంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుప్రమాదం చోటుచేసుకుంది. సైరాంగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని రైలు అసోంలోని హోజాయ్ జిల్లాలో ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలు ఏనుగులు మృతి చెందాయి. ఈ ఘటనలో పలు రైలు భోగీలు పట్టాలు తప్పాయి. ఇంజిన్ సహా 5 బోగీలు పట్టాలు తప్పాయని నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు.
ఈ ఘటనపై అసోం అటవీశాఖ అధికారులు స్పందించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో 7 ఏనుగులు మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక ఏనుగు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోందని వెల్లడించారు.
ఈ ప్రమాదంపై రైల్వే, అటవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెళ్లడిస్థామని అధికారులు తెలిపారు.
Also Read: హైదరాబాద్ -బెళగావి స్పెషల్ ట్రైన్‌కు తప్పిన ప్రమాదం..
[…] […]