మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ తయారీ యూనిట్
మేడ్చల్ (CLiC2NEWS): జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో డ్రగ్స్ తయారీ యూనిట్‌ను పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న 32వేల లీటర్ల ముడిసరుకును స్వాధీనం చేస్తునకున్నారు. మిథైలెనెడియాక్సి మెథాంఫెటమైన్ ముడి పదార్దాలు స్వాధీనం చేసుకున్నారు. మోలి, ఎక్స్‌టిసి పేర్లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులను ముంబయికి తరలించనున్నట్లు సమాచారం. దీనిపై స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించనున్నారు.
[…] మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ తయారీ యూ… […]