బాలుడిని కాపాడేందుకు వెళ్లి.. బావిలో పడ్డ 40 మంది
నలుగురు మృతి.. పలువురికి గాయాలు
భోపాల్ (CLiC2NEWS): ఆడుకోవడానికి వెళ్లిన 8 సంవత్సరా వయసున్న బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. అతడిఇన రక్షించడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో 40 మంది అందులో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని విధిషా జిల్లాలో జరిగింది. జిల్లాలోని విధిషా సమీపంలోని గంజ్ బసోడాలో గురువారం సాయంత్రం ఓ 8 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిపోయాడు. ఆ బాలుడిని రక్షించడానికి పలువురు గ్రామస్తులు బావి వద్ద నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బావి గోడ కూలిపోయింది. దీంతో సుమారు 40 మంది అందులో పడిపోయారు. వారిని రక్షించడానికి అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం చర్యలు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు 23 మందిని రక్షించారు. వారిలో 13 మందిని దవాఖానకు తరలించారు. కాగా, ఆ బాలుడు ఇంకా బావిలోనే ఉన్నదని, అతనికి గాయాలయ్యాయా లేదా అనే విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశామని చెప్పారు. మిగతావారి కోసం గాలిస్తున్నామని తెలిపరు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు.
