ముంబయిలో జోరు వాన‌లు

ముంబయి (CLiC2NEWS): దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయిని భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. శుక్ర‌వారం ఉద‌యం 3 గంట‌ల పాటు వాన దంచికొట్ట‌డంతో ముంబయి న‌గ‌రం నీట మునిగిపోయింది. దీంతో ముంబై న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబ‌యి న‌గ‌రం, థానే, న‌వీ ముంబయి, పాల్ఘ‌ర్‌తో పాటు వీటి స‌మీప ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. రోడ్ల‌పైకి వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో ర‌వాణా వ్య‌వ‌స్థ తీవ్ర ఆటంకం ఏర్ప‌డింది. ప‌లు వీధుల్లోని రోడ్లు చెరువును త‌ల‌పించాయి. రైలు ప‌ట్టాల‌పై వ‌ర‌ద నీరు నిలిచిపోవ‌డంతో లోక‌ల్ ట్రైన్ల ర‌వాణాకు అంత‌రాయం ఏర్ప‌డింది. 20 నుంచి 25 నిమిషాల పాటు రైళ్లు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి.

బంద‌ర్‌లో అత్య‌ధికంగా 141 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం అధికారి కేఎస్ హోస‌లిక‌ర్ తెలిపారు.

ప‌లు ప్రాంతాల్లో న‌మోదైన వ‌ర్ష‌పాతం వివ‌రాలు…

జుహూలో 136 మి.మీ.
మీరా రోడ్డులో 73 మి.మీ.
మ‌హాల‌క్ష్మి ఏరియాలో 56.5 మి.మీ.
భ‌యాంద‌ర్‌లో 53 మి.మీ.
సాంత‌క్రూజ్‌లో 25.1 మి.మీ. రాబోయే 24 గంట‌ల్లో ముంబైలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.