వంద‌మందికిపైగా రౌడీషీట‌ర్ల‌ను రోడ్డుపై న‌డిపించిన పోలీసులు

గుంటూరు (CLiC2NEWS): గుంటూరులో `అంకుశం` సినిమా సీన్ రిపీట్ అయింది.. ఒక‌ప్పుడు (1990) రాజ‌శేఖ‌ర్ హీరో, నీల‌కంఠం (రామిరెడ్డి)ను రోడ్డుపై న‌డిపించిన సీన్ ప్రేక్ష‌కుల‌ను ఓ లెవ‌ల్లో ఆక‌ట్టుకుంది.. ఇప్పుడు గుంటూరు పోలీసులు సేమ్ సీన్ రిపీట్ చేశారు. శ‌నివారం ఇక్క‌డ రౌడీఇజం చేస్తున్న దాదాపు 100 మందికి రౌడీషీట‌ర్ల‌ను గుంటూరులోని డార్మెట‌రీ ప్రాంతానికి త‌ర‌లించారు. అక్క‌డ వారికి పోలీసు కౌన్సెలింగ్ ఇచ్చారు. త‌రువాత గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం చౌర‌స్తాకు త‌ర‌లించారు. అనంత‌రం వారంద‌రి కాళ్ల‌కు చెప్పులు కూడా లేకుండా రోడ్డుపై దాదాపు కిలోమీట‌రు వ‌ర‌కు న‌డిపించారు. అనంత‌రం వారినుంచి సంత‌కాలు తీసుకొని ఇలాగే మంచి మార్గంలో న‌డ‌వాలని సూచించి పంపించి వేశారు. తీరుమార్చుకోక‌పోతే తీవ్ర చ‌ర్య‌లు తీసుకుంటామ రౌడీషీట‌ర్ల‌కు ఎస్పీ వ‌కుల్ జిందాల్ హెచ్చ‌రించారు.

Also Read: స‌మ‌స్య‌-ప‌రిష్కారం!

Leave A Reply

Your email address will not be published.