రోడ్డుప్రమాదంలో భార్య మృతి.. భర్త, కుమారుడికి గాయాలు
చౌటుప్పల్ (CLiC2NEWS): విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భార్య మృతిచెందగా. భర్త, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా మల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
హైదరాబాద్‌లోని గుర్రంగూడకు చెందిన పి. దుర్గ (25), ఆమె భర్త, కుమారుడు స్కూటీపై చెరువుగట్టులోని శ్రీపార్వతి జడగ రామలింగేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం వెనక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ కిందపడిపోవడంతో దుర్గకు తీవ్ర గాయలయి ఘటనాస్థలంలోనే మరణించింది. స్థానికులు గాయాలపాలయిన ఆమె భర్త, కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ప్రయాగ్ రాజ్‌లో పోటెత్తిన భక్తజనం