ఆరు నెలల కనిష్టానికి కరోనా కేసులు

న్యూఢిల్లీ : భార‌త్లో క‌రోనా వృద్ధి రోజురోజుకీ త‌గ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం. గ‌త గడిచిన 24 గంటల్లో 18,732 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే జులై 1 తర్వాత అతి తక్కువ కేసులు ఇప్పుడే నమోదు కావడం విశేషం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,87,850కి చేరింది. గత 24 గంటల్లో 9,43,368 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 2,78,690 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం రికవరీల సంఖ్య 97,61,538కి చేరింది. దీంతో కోలుకున్న వారి రేటు 95.82 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 279 మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,47,622కి చేరువైంది. మరణాల రేటు 1.45 శాతంగా కొనసాగుతోంది. కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం..కొత్త కేసులు తగ్గుదలతో యాక్టివ్‌ కేసులు దిగి వస్తున్నాయి. ఇక కొత్త రకం కరోనా వైరస్‌ కలవరపెడుతున్న నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో దాదాపు ఐదు శాతం పాజిటివ్‌ కేసుల నమూనాలకు సమగ్ర జన్యు విశ్లేషణ జరపాలని కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయించింది.

Leave A Reply

Your email address will not be published.