Jobs: ఎన్‌సిఆర్‌టిసిలో 67 సూప‌ర్‌వైజ‌ర్ పోస్టులు

Jobs:  నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (NCRTC).. సూప‌ర్‌వైజ‌ర్ -1 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. ఇంజినీరింగ్‌, ఐటిఐ విద్యార్హ‌త‌లు క‌ల‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆప‌రేష‌న్స్‌, ఎల‌క్ట్రానిక్స్ , ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, సివిల్ ఆర్ ఎసి, విభాగాల్లో మొత్తం 67 ఖాళీలు ఉన్నాయి.

సూప‌ర్‌వైజ‌ర్ -1 పోస్టులు 43

ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎల‌క్ట్రానిక్స్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ సివిల్ బ్రాంచ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి . లేదా ఆ విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 37వేల నుండి రూ. 1,15,000 వ‌ర‌కు ఉంటుంది.

జూనియ‌ర్ మెయింటెన‌ర్ ఖాళీలు 24

ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి వేత‌న శ్రేణి నెల‌కు రూ. 18,250 నుండి రూ. 59,200 వ‌ర‌కు ఉంటుంది. వీటికి అద‌నంగా విడిఎ, హెచ్ ఆర్ ఎ, పెర్క్స్ , ఇత‌ర ప్రోత్సాహ‌కాలు ఉంటాయి.
ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎల‌క్ట్రీషియ‌న్‌/ ఫిట్ట‌ర్‌/ రిఫ్రిజిరేష‌న్ అండ్ ఎయిర్ కండిష‌నింగ్‌/ ఎల‌క్ట్రానిక్స్ ట్రేడ్‌తో ఐటిఐ (ఎన్‌సివిటి/ ఎస్‌సివిటి) ఉత్తీర్ణులై ఉండాలి.

ద‌ర‌ఖాస్తుల‌ను అక్టోబ‌ర్ 9వ తేదీలోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు ఫీజు అన్ రిజ‌ర్వ‌డ్ , ఒబిసి (ఎన్‌సిఎల్‌), ఇడ‌బ్ల్యుఎస్‌ల‌కు రూ.500 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి, ఎస్‌సి, దివ్యాంగుల‌కు ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తు దారుల వ‌య‌స్సు 28 ఏళ్ల లోపు ఉండాలి. ఒబిసిల‌కు ఎన్‌సిఎల్ ల‌కు మూడేళ్లు .. ఎస్‌టి, ఎస్‌సి, అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు మ‌రియు దివ్యాంగుల‌కు ప‌ది నుండి ప‌దేహేనేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక: కంప్యూట‌ర్ బేస్గ్ టెస్ట్ (సిబిటి) ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిప‌దిక‌న ఎంపిక జ‌రుగుతుంది. సిబిటి 100 మార్కుల టెస్ట్‌. స‌మ‌యం 90 నిమిషాలు ఉంటుంది.

వీటిలో అన్ రిజ‌ర్వ్‌డ్ / ఒబిసి (ఎన్‌సిఎల్) / ఇడ‌బ్ల్యుఎస్‌లు 60%.. ఎస్‌సి, ఎస్‌టి, మాజి సైనికోద్యోగులు, దివ్యాంగులు 50% క‌నీస అర్హ‌త‌త మార్కులు సాధించాల్సి ఉంటుంది. వారిని షార్ట్‌లిస్ట్ చేసి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. అనంత‌రం కేట‌గిరీల వారీగా తుది ఎంపిక జ‌రుగుతుంది.
ఎంపికైనవారు రెండేళ్ల‌పాటు ప్రొబేష‌న్ పిరియ‌డ్ ఉంటుంది. ప్రొబేష‌న్‌లో సేవ‌లు అందించాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు http://www. ncrtc.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

Also Read: Happy Ganesh Chaturthi: వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్ష‌లు

Leave A Reply

Your email address will not be published.