కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో 1748 జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు

రేపే ఆఖ‌రి తేదీ ..

Jobs:  కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో 1748 జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు డిప్లొమా లేదా బిటెక్ అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో జూనియ‌ర్ ఇంజినీర్ (JE)పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆగ‌స్టు 1,2026 నాటికి 30 ఏళ్ల లోపు ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ.  ఈ పోస్టులకు ఎంపికైన వారు మొద‌టి నెల నుండే రూ.70వేల జీతం అందుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.100 గా నిర్ణ‌యించారు. మ‌హిళ‌లు, ఎస్‌టి, ఎస్‌సి , దివ్యాంగులకు ఫీజు ఉండ‌దు. ఈ పోస్టుల‌ను స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిటి ద్వారా  భ‌ర్తీ చేస్తారు.

అర్హ‌త: డిప్లొమా లేదా బిఇ/  బిటెక్  అర్హ‌త‌లు క‌లిగి ఉండాలి. మ‌రికొన్ని పోస్టుల‌కు బిఎస్‌సి ఫిజిక్స్ /  కంప్యూట‌ర్ సైన్స్ /  ఎల‌క్ట్రానిక్స్  విద్యార్హ‌త‌లు ఉండాలి.

ఎంపిక: రెండు ద‌శ‌ల్లో ఆన్‌లైన్  ప‌రీక్ష‌ల ద్వారా ఈ పోస్టుల‌కు ఎంపిక జ‌రుగుతంది.

పేప‌ర్ -1: 200మార్కుల పేప‌ర్ ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న పోస్టు ప్ర‌కారం సంబంధిత విభాగం నుండి 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. మిగిలిన 100 మార్కుల‌కు జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్  అండ్ రీజ‌నింగ్ 50 మార్కులు, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్  50 మార్కులు ఉంటాయి. ప్ర‌తి రాంగ్ ఆన్స‌ర్‌కు పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు.

ఈ ప‌రీక్ష అక్టోబ‌ర్‌/  నవంబ‌ర్ నెల‌ల్లో నిర్వ‌హిస్తారు.

పేప‌ర్ -2: పేప‌ర్ -1లో అర్హ‌త సాధించ‌న వారే పేప‌ర్ -2 ప‌రీక్ష రాయ‌గ‌లుగుతారు. ఈ ప‌రీక్ష 300 మార్కుల‌కు ఉంటుంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి ఒక మార్కు చొప్పున త‌గ్గిస్తారు. దీనిలో వ‌చ్చే మార్కులే కీల‌కం. ఆర్ ఆర్ బి జెఇ (JE) ప‌రీక్ష‌ల‌కు  ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు దీనికి కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దాదాపు రెండింటికి ఒకే ర‌క‌మైన స‌న్న‌ద్ద‌త ఉంటుంది.

ఈ ప‌రీక్ష డిసెంబ‌ర్‌లో నిర్వ‌హిస్తారు.

ధ్రువ ప‌త్రాలు ప‌రిశీలించిన అనంత‌రం పోస్టుకు ఎంపిక చేస్తారు. వీరికి లెవెల్ -6 వేత‌న శ్రేణి ప్ర‌కారం జీతం అందుతుంది. వీటికి అద‌నంగా ఇత‌ర అల‌వెన్సులు ఉంటాయి. విధుల్లో చేరిన త‌ర్వాత అనుభ‌వం, నైపుణ్యాలు, విద్యార్హ‌త‌ల‌తో.. అసిస్టెంట్ ఇంజినీర్‌, సీనియ‌ర్ సెక్ష‌న్‌, ఇంజినీర్‌, అసిస్టెంట్ డివిజిన‌ల్ ఇంజినీర్ స్థాయికి చేరుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు దారులు పూర్తి వివ‌రాల‌కు https://ssc/gov.in/login వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు

 

Jobs: ఎన్‌సిఆర్‌టిసిలో 67 సూప‌ర్‌వైజ‌ర్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.