కామారెడ్డిలో ఘనంగా శాఖా సప్తాహం

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలోని స్వప్నలోక్ కాలనీలో సంఘ శతాబ్దిలో భాగంగా ఆదివారం శాఖా సప్తాహం చివరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహా సంఘ చాలక్ కొమిరెడ్డి స్వామి మాట్లాడుతూ.. యాంత్రిక జీవనంలో ప్రతీ ఒక్కరికి ఒక గంట శాఖ ఖచ్చితంగా అవసరమని అన్నారు. శాఖా వ‌ల్ల మ‌నిషి శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారని తెలిపారు. ప్రజలందరూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలని కోరారు.

గ‌త నెల‌(సెప్టెంబర్) 27 నుండి అక్టోబర్ 4 వరకు ప్రతిరోజు ఉదయం 6 నుండి 7 గంటల వరకు శాఖ నిర్వహించామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం శాఖ నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాఖ సప్తాహం చివరి రోజైన ఉపస్థితి దిన్ లో ఎక్కువ సంఖ్యలో యువకులు, పిల్లలు పాల్గొన్నారు.

Also Read: మ‌హాత్మా గాంధీ , లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి

Leave A Reply

Your email address will not be published.