రూ.4 కోట్ల క‌రెన్సీ నోట్ల‌తో అలంకృతుడైన లంబోద‌రుడు

 నందిగామ (CLiC2NEWS): ప్ర‌తి ఏడాది వినాయ‌క‌చ‌వితి రాగానే వీధుల‌న్నీ గ‌ణేషుడి మండ‌పాల‌తో నిండిపోతాయి. ఈ న‌వ‌రాత్రులలో విఘ్నేశ్వ‌రుడుని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ శ‌క్తి కొద్దీ అలంక‌రించి పూజ‌లు నిర్వ‌హిస్తారు. గ‌ణేశ్‌నుని విగ్ర‌హాలు సైతం వివిధ ర‌కాలలుగా త‌యారు చేయ‌డ‌మే కాకుండా అలంక‌ర‌ణ‌లో కూడా త‌మ‌కు తామే సాటి అనే విధంగా పోటాపోటీ గా మండ‌పంలో అలంక‌ర‌ణ‌లు ఉంటాయి. క‌రెన్సీ నోట్ల‌తోనూ , వెండి, బంగారంతోనూ.. ముత్యాలు, చిల్ల‌ర కాయిన్స్ తోనూ.. శ‌క్తి కొల‌దీ త‌మ‌కు న‌చ్చిన‌ట్లు అలంక‌రించుకుంటారు.

దేవీ న‌వ‌రాత్రుల‌లో కూడా అమ్మ‌వారిని ఇదే విధంగా అలంక‌రిస్తూ పూజ‌లు చేస్తుంటారు. అలాంటిదే ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్‌లో చోటుచేసుకుంది. ఏకంగా రూ. 4.50 కోట్ల క‌రెన్సీ నోట్ల‌తో సోమ‌వారం గ‌ణ‌ప‌తి మండ‌పంలో అలంక‌ర‌ణ చేశారు. గ‌ణ‌ప‌తి ఉత్స‌వ క‌మిటి ఆధ్వ‌ర్యంలో 44 వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కొత్త క‌రెన్సీ నోట్ల‌తో అలంక‌రించారు.కింద‌టి సంవ‌త్స‌రం రూ. 3.33కోట్ల‌తో గ‌ణ‌నాధుడిని అలంక‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది దానిక‌న్నా ఎక్కువ మొత్తంతో అలంక‌ర‌ణ చేశారు. దీంతో ఈ గ‌ణ‌నాధుడిని ద‌ర్శించుకునేందుకు బ‌క్తులు బారులు తీరారు.

Also Read:  బాగ్‌లింగంప‌ల్లిలో కొలువుదీరిన‌ గ‌ణ‌నాధుడి విగ్ర‌హాలు

Leave A Reply

Your email address will not be published.