అంగన్‌వాడి కేంద్రాల‌పై రిమార్కులు వ‌ద్దంటే.. లంచం డిమాండ్‌

మెట్‌ప‌ల్లి: రూ.63వేలు లంచం తీసుకుంటూ సిడిపిఒ అనిశాకు చిక్కారు.

మెట్‌ప‌ల్లి (CLiC2NEWS): అంగ‌న్‌వాడి కేంద్రాలపై రిమార్కులు లేవ‌ని రాయ‌డానికి రూ.63వేలు లంచం తీసుకుంటూ మెట్‌ప‌ల్లి సిడిపిఒ అనిశాకు చిక్కారు. అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను ప్ర‌తి నెలా పై అధికారులు తనిఖీలు నిర్వ‌హిస్తుంటారు. ఆ స‌మ‌యంలో రిమార్కులు రాయ‌కుండా.. అంతా స‌వ్యంగానే ఉంద‌ని వారికి అనుకూలంగా రాయాడానికి లంచం తీసుకుంటూ మెట్‌ప‌ల్లి ఐసిడిఎస్ సిడిపిఒ అవినీతి నిరోధ‌క శాఖ అధికారులకు ప‌ట్టుబడ్డారు. జ‌గిత్యాల జిల్లా మెట్‌ప‌ల్లి సిడ‌పిఒ ప‌ద్మ.. మొత్తం 21 అంగ‌న్వాడీల‌ను త‌నిఖీలు నిర్వ‌హిస్తారు. అంగ‌న్ వాడీ కేంద్రాల‌పై ఎటువంటి రిమార్కులు లేవ‌ని రాయాలంటే ప్ర‌తి నెల వెయ్యి రూపాయ‌లు లంచం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యాన్నిబాధితులు అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌ దృష్టికి తీసుకువెళ్లారు. . మూడు నెల‌ల‌కు సంబంధించి మొత్తం రూ.63వేలు లంచం తీసుకుంటుండ‌గా ప‌ద్మ‌ను అనిశా అధికారులు అరెస్టు చేశారు. ఆమెపై కేసు న‌మోదు చేసి క‌రీంన‌గ‌ర్ అనిశా కోర్టులో హాజ‌రుప‌రిచారు.

Leave A Reply

Your email address will not be published.