రజినీ ఇంటి ఎదుట నిప్పంటించుకున్న అభిమాని
చెన్నై: ఈ మధ్యకాలంలో తమిళనాట ఎక్కడ చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అనారోగ్యం వలన రజనీ రాజకీయాలలోకి రాలేనంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టడం, ఇంటి ముందు నిరసనలు, ర్యాలీలు చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా మురుకేసన్ అనే వ్యక్తి రజనీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మురుకేసన్‌ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ప్రస్తుత వైద్యం అందిస్తున్నారు. రజనీకాంత్ తన నిర్ణయం ప్రకటించినప్పటి నుండి తమిళనాట భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. వీటికి తలైవా ఎలా చెక్ పెడతాడని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.