2 నెలల పసికందును లాక్కెళ్లిన చిరుత
జల్‌గావ్ (CLiC2NEWS): తల్లి పక్కన నిద్రిస్తున్న రెండునెలల పసికందును చిరుత పులి లాక్కెళ్లిన విషాద ఘటన మహారాష్ట్ర లో చోటుచేసుకుంది. జల్‌గావ్ జిల్లాలోని మమల్డే గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు…
ఆరుబయట తన రెండు నెలల శిశువుతో పాటు ఓ తల్లి నిద్రపోయింది. కుటుంబ సభ్యులు తెల్లవారు జామున చూసేసరికి ఆ చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ గాలింపులో ఇంటికి కొంత దూరంలోని పంట పొలాల్లో మాంసపు ముద్దను గుర్తించారు. సమాచారం మేరకు అధికారులు , పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో చిన్నారిని చిరుత లాక్కెళ్లిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్త తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గతంలో పలుమార్లు పశువులపై పులి దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా చిన్నారిని పులి లాక్కెళ్లడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్యప్రానుల సంచారాన్ని అరికట్టేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read:AP: చల్లపల్లి పిఎస్‌లో పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు