AP: చ‌ల్ల‌ప‌ల్లి పిఎస్‌లో పేలుడు.. న‌లుగురికి తీవ్ర గాయాలు

చ‌ల్ల‌ప‌ల్లి (CLiC2NEWS): ఎపిలోని కృష్ణా జిల్లా చ‌ల్ల‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు పోలీసుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.  బ‌య‌ట నుంచి తీసుకొచ్చిన పేలుడు ప‌దార్థాల‌ను స్టేష‌న్‌లో ప‌రిశీలిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.  ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిలో ఎస్ ఐతో పాటు ఇద్ద‌రు కానిస్టేబుళ్లు, పోలీసు వేహికిల్ డ్రైవ‌ర్ ఉన్నారు.  ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

సిఐ కెఎస్ రావు విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిశీలించారు. ప్ర‌మాదంపై విచారణ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఎపి హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు.  గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని సూచించారు.

Also Read: CLiC2NEWS వీక్ష‌కుల‌కు శ్రీ‌రామ‌ న‌వ‌మి శుభాకాంక్ష‌లు

Leave A Reply

Your email address will not be published.