లీట‌రుకు రూ.3 మేర పెరిగిన‌ పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు..

Petrol and diesel prices increased: ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న ఉద్రిక్త‌ల నేప‌థ్యంలో.. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతాయంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా దేశంలో పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌రు పెట్రోల్‌పై స‌గ‌టును రూ.3.. డీజిల్‌పై కూడా రూ. 3 చొప్పున పెంచిన‌ట్లు స‌మాచారం. పెరిగిన ధ‌ర‌లు శుక్ర‌వారం ఉద‌యం 6 గంట‌ల నుండే అమ‌ల్లోకి వ‌చ్చాయి.

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధ వాతావ‌ర‌ణం కార‌ణంగా ఇంధ‌న కొర‌త ఏర్ప‌డుతుంద‌ని దేశంలో వార్తలు వ‌స్తున్నాయి. కానీ, మ‌న‌కు స‌రిపడా ఇంధ‌న నిల్వ‌లు ఉన్నాయ‌ని, ఎవ్వ‌రూ భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని కేంద్రం చెప్పుకుంటూ వ‌చ్చింది. అయినా స‌రే, వాహ‌నదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వ‌ద్ద బారులు తీరారు. దీంతో బంకుల వ‌ద్ద నో స్టాక్ బోర్డులు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

దేశంలో 2022 నుండి పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు దాదాపు మార‌లేదు. 2024 మార్చిలో మాత్రం లీట‌రుకు ర‌. 2 చొప్పున త‌గ్గించాయి. యుద్ధ సంక్షోభంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. అయినా.. దేశంలోని చ‌మురు కంపెనీలు ధ‌ర‌లను పెంచ‌లేదు. తాజాగా ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు..

ఎపిలో లీట‌రు పెట్రోల్ పై రూ. 3.29.. డీజిల్‌పై రూ. 3.14 పెరిగింది.
తెలంగాణ‌లో పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 3 చొప్పున కంపెనీలు పెంచాయి.

 

Also Read: అత‌ని గానానికి ఫిదా.. గాయ‌కుడిపై క‌రెన్సీ నోట్ల వ‌ర్షం..

Leave A Reply

Your email address will not be published.