మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు..

  కామారెడ్డి (CLiC2NEWS):  కామారెడ్డి జిల్లా కేంద్రంలో  శుక్రవారం  ఉచిత మెగా వైద్య  శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని  విజయవంతంగా నిర్వ‌హించారు.   ఈ క్యాంపులో ఇసిజి, టు డిఇకొ, లిపిడ్ ప్రొఫైల్, రక్త పరీక్షలు, బిపి, షుగర్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ క్యాంపుకు కామారెడ్డి జిల్లాలోని సుమారు 400 పైగా  పేషెంట్లు హాజరై ఉచిత పరీక్షలు చేయించుకున్న‌ట్లు  ఆసుపత్రి నిర్వాహకులు భోగి రవి  ప్రకటనలో తెలిపారు. మోక్ష ఆసుపత్రి వార్షికోత్సవ సందర్భంగా ఈ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఏడాది మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇలాంటి అవకాశం కామారెడ్డి ప్రజలకు అందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

AP: ఉచితంగా రెటీనోప‌తి ఇంజ‌క్ష‌న్‌లు!

Leave A Reply

Your email address will not be published.