వ్యాను బావిలోకి దూసుకెళ్లి.. ఘోర ప్ర‌మాదం

8 మంది మృతి

Road Accident:  దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా వ్యాను బావిలోకి దూసుకెళ్ల‌డంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. వ్యానులో ఉన్నవారిలో 8 మంది మృతి చెంద‌గా మ‌రో ఆరుగురికి తీవ్ర‌గాయ‌ల‌య్యాయి. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మ‌స్వ‌ద్ నుండి పండ‌ర్ పూర్ వెళుతుండ‌గా రోడ్డు ప‌క్క‌న వ్య‌వ‌సాయ భూమిలోని బావిలోకి వాహ‌నం దూసుకుపోయింది. సాగ‌ర్ చౌగులే త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా.. వారు ప్రయాణిస్తున్న వాహ‌నం తాండుల్వాడి స‌మీపంలో ఉన్న వ్య‌వ‌సాయ భూమిలోకి దూసుకుపోయింది. అక్క‌డే ఉన్న బావిలోకి ప‌డిపోవ‌డంతో ఈ ప్రమాదం జ‌రిగింది.

 

Job News: డిప్యూటి ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ పోస్టులు 24

1 Comment
Leave A Reply

Your email address will not be published.